నేపాల్లో జెన్ జెడ్ యువత ఆధ్వర్యంలో సోషల్ మీడియా బ్యాన్ నేపథ్యంలో తీవ్రమైన అల్లర్లు జరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినట్లు నేపాల్ సైన్యం ప్రకటించింది. దేశ భద్రతకు ముప్పు ఉందని, అల్లర్లతో పాటు దోపిడీలు, హింసాత్మక చర్యలు జరుగుతున్నాయని పేర్కొంది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి రాజీనామా చేసిన తర్వాత సైన్యం దేశ భద్రతా బాధ్యతలు చేపట్టింది.