TG: కాసేపట్లో TGPSC అత్యవసర సమావేశం కానుంది. గ్రూప్-1పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించనుంది. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ న్యాయనిపుణులు, ప్రభుత్వంతో TGPSC చర్చించనుంది. అప్పీల్‌పై సాయంత్రం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు వరకైనా వెళ్లాలని TGPSC భావిస్తోంది.