AP: కాలినడకన తిరుమలకు టీటీడీ నూతన ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ చేరుకున్నారు. టీటీడీ ఈవోగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. భక్తుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. 1994లో మొదట తిరుమలకు కుటుంబంతో పాటు వచ్చానని.. స్వామి దర్శనం కోసం 7 గంటలు ఎదురు చూసి దర్శనం చేసుకున్నానని గుర్తు చేశారు. సామాన్య భక్తుడిగా దర్శనం చేసుకున్నప్పుడు సామాన్యుల బాధలు తెలిశాయని చెప్పారు.