GNTR: ఫిరంగిపురంలో వీధి కుక్కల బెడద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై, ముఖ్యంగా పిల్లలపై దాడి చేస్తున్నాయి. గుంటూరులో జరిగిన విషాదం ఇక్కడ కూడా పునరావృతమవుతుందేమోనని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బుధవారం స్థానికులు తెలిపారు.