JGL: జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని సయ్యద్ ఫలక్ CPGET- 2025 (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్)లో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. హిందీ విభాగానికి చెందిన ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ హిందీ కోర్సులో ప్రవేశానికి అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఆమెను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్ కళాశాల యందు అభినందించారు.