ATP: మంత్రి లోకేశ్ నేటి అనంతపురం పర్యటన రద్దయింది. నేపాల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో, ఆ దేశంలో ఉన్న ఏపీ ప్రజలను సురక్షితంగా తీసుకురావడంపై లోకేష్ దృష్టి సారించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అనంతపురం పర్యటన రద్దయిందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేడు అనంతపురంలో జరగనున్న ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభలో పాల్గొననున్నారు.