KMM: తల్లాడ మండలంలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. ప్రధాన రహదారిపై తిరుగుతున్న వీధి కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లోనూ కుక్కల బెడద తీవ్రంగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.