KRNL: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 9 ఐసీడీఎస్, ప్రాజెక్టుల్లో 8 కార్యకర్తలు, 49 సహాయకుల పోస్టులు భర్తీ చేయనున్నారు. కార్యకర్తలకు 10వ తరగతి, సహాయకులకు 7వ తరగతి పాస్ అర్హతగా నిర్ణయించారు. దరఖాస్తులు సంబంధిత సర్టిఫికెట్లతో కలిపి 17వ తేదీ లోపు సీడీపీవో కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.