చిత్తూరు: గంగాధర నెల్లూరులో బుధవారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నామని నగరి విద్యుత్ సబ్ డివిజన్ ఏడీఈ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా నగరి, నిండ్ర, విజయపురం మండలాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఉదయం 11 నుంచి మధ్యాహ్న 1 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారని వివరించారు.