అన్నమయ్య: మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 12న ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల బాలికల ఫుట్ బాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శులు నాగరాజు,ఝాన్సీ, సరిత, కిషోర్, భార్గవి తెలిపారు. 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఈ మేరకు పోటీలకు వచ్చే విద్యార్థులు 10వ తరగతి ఒరిజినల్ మార్కుల జాబితా స్టడీ సర్టిఫికేట్ క్రీడా దుస్తులతో హాజరుకావాలని చెప్పారు.