KDP: ప్రొద్దుటూరు-1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కాపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. మట్కా బీటర్లు, అనుమానిత ఇళ్ళలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్నా నగరులో మట్కా నిర్వహిస్తున్న బీటర్ షేక్ సాధక్ వల్లి అనే వ్యక్తి నుంచి మట్కా చిట్టీలు, నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.