NLR: దుత్తలూరు మండలంలోని నందిపాడు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో మంగళవారం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదగా అవార్డు అందుకున్న ఫాతిమాజాను యుటిఎఫ్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వం గుర్తించిదని తెలిపారు.