GST రేట్ల కోత ప్రయోజనాన్ని కొనుగోలుదార్లకు బదిలీ చేయడంలో భాగంగా జాగ్వార్ లాండ్ రోవర్ తన వాహన మోడళ్ల ధరను రూ.4.5 లక్షల నుంచి రూ.30.4 లక్షల వరకు తగ్గించింది. ఈ రేట్ల తగ్గింపును తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు పేర్కొంది. రేంజ్ రోవర్ ధర రూ.4.6 నుంచి 30.4 లక్షలు, డిఫెండర్ ధర రూ.7 నుంచి 18.60 లక్షలు, డిస్కవరీ ధర రూ.4.5 నుంచి 9.90 లక్షల మేర తగ్గాయి.