MDK: పిల్లలను ఆసుపత్రిలో చూపించడానికి వెళ్లిన తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నారాయణపూర్‌కు చెందిన వివాహిత తన ఇద్దరు పిల్లలను మంగళవారం ఆసుపత్రిలో చూపించడానికి వెళ్లి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.