Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర... అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. కాగా... లోకేష్ పాదయాత్రలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర… అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. కాగా… లోకేష్ పాదయాత్రలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లోకేష్ పాదయాత్రలో దేవాన్ష్ ఫ్లెక్సీలు వెలిశాయి.
లోకేష్ పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నారా దేవాన్ష్, జేసీ బ్రదర్స్ మనవడు ధీర్ రెడ్డితో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో ‘ మా నాన్నలు నలభైలో ఉన్నారు.. వాళ్ల స్థితే అధ్వాన్నంగా ఉంటే.. 10లో ఉన్నాం మా పరిస్థితేంటో?’ అంటూ ఇద్దరి ఫోటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రేపటి బాగు కోసం కదలిరండి అని పిలుపునిచ్చారు. ఈ ఫ్లెక్సీని చూసిన లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేసి నవ్వుకున్నారు. కాగా నేడు లోకేష్ యాత్ర 68 వ రోజుకు చేరింది. జిల్లాలోని రాయలచెరువులో బుధవారం జరిగే బహిరంగసభలో లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా.. లోకేష్ పాదయాత్ర, బహిరంగసభను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.