HYD: సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఇప్పటివరకు 27 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేసును సీసీఎస్‌కు బదిలీ చేయగా.. డాక్టర్ నమ్రతను కస్టడీకి తీసుకొని పోలీసులు విచారించారు. పదేళ్లుగా సరోగసీ ముసుగులో కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తేల్చారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌తో అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు.