MBNR: జిల్లా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఇవాళ రానున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయనకు జిల్లా అధికారులు స్వాగతం పలకనున్నారు.