PLD: రైతుల కోసం ఉద్దేశించిన ఎరువులను టీడీపీ నాయకులే దారి మళ్లించి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళవారం మాచర్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు.