అన్నమయ్య: రాజంపేట అటవీ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం ప్రత్యేక దాడిలో 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, తమిళనాడుకు చెందిన ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌ను టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు, డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్, ఆర్ఎస్సై వినోద్‌కుమార్ బృందం చేపట్టింది.