శ్రీకాకుళం: స్త్రీ శక్తి భారం కాదు బాధ్యత అని శ్రీకాకళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మంగళవారం నగరంలో స్త్రీ శక్తి పథకం ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం వల్ల ఎక్కువ మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. త్వరలో మహిళలు, ట్రాన్స్ జెండర్లకు స్మార్ట్ కార్డులను అందజేస్తామన్నారు.