CTR: జిల్లాలో లింగ నిష్పత్తిలో భారీ వ్యత్యాసాలు ఆందోళన కలిగిస్తోంది. వెయ్యి మంది మగవారికి నగరిలో అత్యల్పంగా 873 అమ్మాయిలు ఉండగా, పలమనేరులో 894, కుప్పంలో 904, చిత్తూరులో 912 మంది అమ్మాయిలు ఉన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యత్యాసాలకు బాల్య వివాహాలు, గర్భంలో లింగ నిర్ధారణ, అబార్షన్లు ప్రధాన కారణమని భావిస్తున్నారు.