అన్నమయ్య: రాయచోటి మంగళ కాలనీలో మంగళవారం నాయీ బ్రాహ్మణ సంఘాల అభినందన సభ జరిగింది. ఈ సభలో టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. భవిష్యత్తులో నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం మరిన్ని సేవలు, తోడ్పాటు అందించేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటారని తెలిపారు.