VSP: విశాఖ స్టీల్ సిటీలో ఈనెల 22 నుంచి బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్.కుమార్ స్వామి మంగళవారం తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు జరిగే సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామన్నారు. సంబరాలను విజయవంతం చేయాలని కోరారు.