NLG: అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణీకి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రేహౌండ్స్ పీసీ స్వామి HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీకి ఆపరేషన్‌కు రక్తం అవసరమైంది. విషయం తెలుసుకున్న చింతపల్లి(M)G గౌరారం వాసి స్వామి స్పందించి రక్తదానం చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. తోటి మనిషిని ఆదుకోవాలనే ఆయన తపనకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.