»Hyderabad Bcci Plans Massive Upgrade To Five Stadiums Including Uppal Stadium
Cricket అభిమానులకు శుభవార్త.. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో Uppal Stadium
కనీసం మరుగుదొడ్లు సక్రమంగా లేవు. ప్రేక్షకులు కూర్చోవడానికి కుర్చీలు విరిగిపోయి ఉంటాయి. స్టేడియం అంతా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. అయినా కూడా అందులోనే మ్యాచ్ లు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోనే ప్రధాన స్టేడియం హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ (Uppal) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium) నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ (Cricket) అభిమానులకు ఉప్పల్ స్టేడియం ఒక చిరస్మరణీయ వేదిక. ఇక ఈ స్టేడియంలో భారత క్రికెటర్లు చిరస్థాయిలో నిలిచే ప్రదర్శన చేశారు. అద్భుతమైన విజయాలకు ఉప్పల్ స్టేడియం కేంద్రంగా నిలిచింది. అయితే గతమెంతో ఘనం అని చెప్పుకునే పరిస్థితి. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో మౌలిక వసతులు కరువయ్యాయి. కనీసం మరుగుదొడ్లు సక్రమంగా లేవు. ప్రేక్షకులు కూర్చోవడానికి కుర్చీలు విరిగిపోయి ఉంటాయి. స్టేడియం అంతా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. అయినా కూడా అందులోనే మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇకపై ప్రేక్షకులకు ఆ బాధలు ఉండబోవు. ఎందుకంటే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (Board of Control for Cricket in India -BCCI) బీసీసీఐ స్టేడియాన్ని అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఆధునీకరిస్తోంది.. స్టేడియం రూపురేఖలు మార్చనుంది.
ప్రపంచకప్ (World Cup) నేపథ్యంలో ఐదు స్టేడియాలను ఆధునీకరించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఉప్పల్ స్టేడియం అభివృద్ధి చేయడానికి బీసీసీఐ రూ.177.17 కోట్లతో ప్రణాళికలు (Plans) రూపొందించింది. హైదరాబాద్ తోపాటు దేశంలోని ఢిల్లీ, కోలక్ త్తా, మొహలీ, ముంబై స్టేడియాలను రూ.500 కోట్లతో ఆధునీకరించనుంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ ఉండే అవకాశం ఉంది. ఈ స్టేడియాల్లో మ్యాచ్ లు సక్రమంగా నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేయనుంది.
ఉప్పల్ కు మహర్దశ
అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ఉప్పల్ స్టేడియాన్ని తీర్చిదిద్దనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఉత్తర, దక్షిణ స్టాండ్లపై పైకప్పు ఉంది. దక్షిణం దిశలో పైకప్పు దెబ్బతినడంతో మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇవే కాకుండా మౌలిక సౌకర్యాలు కొరవడ్డాయి. రూ.117.17 కోట్లతో స్టేడియం రూపురేఖలనే మార్చేందుకు బీసీసీఐ నిర్ణయించింది. అయితే హెచ్ సీఏ దీనికి సహకరిస్తుందో లేదో వేచి చూడాలి. ఇంకా హెచ్ సీఏలో విభేదాలు పరిష్కారం కాలేదు. వివాదం కొనసాగుతుండడంతో ఈ అభివృద్ధి పనులకు సహకరించకపోతే మాత్రం ఆ నిధులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. దీని కారణంగా హైదరాబాద్ ప్రపంచకప్ మ్యాచ్ లు జరిగే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఏ స్టేడియంలో లేనంతా ప్రేక్షకులతో ఉప్పల్ స్టేడియం నిండిపోతున్నది.