»Virat Kohli Also Did That Old Rice Eat Kerala Chief A Key Decision In The Matter Of Food Wastage
Virat Kohli: కూడా అలా చేశాడు…ఫుడ్ వృథా కాకుండా కీలక నిర్ణయం
ప్రముఖ ఇండియన్ స్టార్ క్రెకెటర్ విరాట్ కోహ్లీ(virat Kohli) ఓ సందర్భంలో ఉదయం ఆహారాన్నే రాత్రి కూడా తిన్నట్లు తెలిసింది. కోహ్లీకి వడ్డించిన ఓ 5 స్టార్ హోటల్ చెఫ్ ఈ మేరకు ఆ స్టోరీని పంచుకున్నారు. అసలు ఏం జరిగింది. విరాట్ ఎందుకు అలా చేశారో ఇప్పుడు చుద్దాం.
ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat Kohli) తన బ్యాటింగ్‌తోనే కాదు ఫిట్నెస్తో కూడా ఎంతో ప్రసిద్ధి చెందాడు. అంతేకాదు విరాట్ తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ఎంతో సాధన చేస్తాడు. దానికి తోడు ప్రత్యేక ఆహారం కూడా తీసుకుంటాడు. తరచుగా అతని ఆహారంలో ఖరీదైన వంటకాలు కూడా ఉంటాయి. కానీ విరాట్ కోహ్లి ఇటీవల ఓ 5 స్టార్ హోటల్‌కి వెళ్లి మిగిలిపోయిన ఆహారం తిన్నారని తెలిసింది. ఇది విన్న విరాట్ అభిమానులు చాలా వరకు నమ్మరు. కానీ ఇది నిజం. తాజాగా ఓ చెఫ్ విరాట్ కోహ్లితో జరిగిన తన అనుభవాన్ని ఈ మేరకు పంచుకున్నారు.
2018లో తిరువనంతపురంలో భారత్(india), వెస్టిండీస్(west indies) మధ్య వన్డే జరగాల్సి ఉంది. ఆ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు కోవలం హోటల్లో బస చేశారు. ఆ క్రమంలో టీమ్ ఇండియా కోసం హోటల్ మేనేజ్మెంట్ విలాసవంతమైన సీ ఫుడ్‌ను సిద్ధం చేసింది. అయితే కోహ్లి మాత్రం ఆ సమయంలో శాఖాహారం మాత్రమే తిన్నాడు. అందుకే సీ ఫుడ్ తినడానికి నిరాకరించాడు.
ఆ క్రమంలో చెఫ్ కోహ్లీని సంప్రదించి పలు రకాల వంటకాలతో కూడిన కేరళ(kerala) శాఖాహారం విందు ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో కోహ్లీ కోసం చెఫ్ తన బృందంతో కలిసి 24 శాఖాహార వంటకాలను సిద్ధం చేశారు. అయితే అవన్నీ కేవలం ఒకరి కోసం చేయడం కష్టంగా మారిందని అప్పుడు చెఫ్ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు కోహ్లికి తానే ఆహారం వడ్డించడానికి స్వయంగా వెళ్లినట్లు తెలిపారు. ఆ క్రమంలో మిగిలిపోయిన ఆహారం గురించి దానిని ఏం చేస్తారని విరాట్ అడిగినట్లు చెప్పాడు. అందుకు దానిని పడేస్తామని చెప్పడంతో కోహ్లీ.. ఆహారాన్ని వృథా చేయకుండా రాత్రిపూట కూడా అదే ఆహారం తింటానని అతనితో చెప్పాడు.
అయితే హోటల్ రూల్స్ సహా బీసీసీఐ(Bcci) నిబంధనల ప్రకారం, ఏ ఆటగాడికి కూడా పాత ఆహారాన్ని అందించకూడదు. కానీ విరాట్ కోహ్లీ చివరకు తన నిర్ణయానికే కట్టుబడి రాత్రిపూట ఆహారాన్ని వృథా చేయకుండా పాత ఆహారాన్ని తిన్నాడని ఆ చెఫ్ వెల్లడించారు. స్టార్ క్రికెటర్ స్థాయిలో ఉండి ఏదైనా తినగలిగే హోదాలో ఉండి కూడా విరాట్ అలా చేయడం పట్ల కేరళ చెఫ్ పిళ్లై సంతోషం వ్యక్తం చేస్తూ కోహ్లీ గొప్ప ఆటగాడే కాదు, గొప్ప మనిషి అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వెల్లడించారు. ఇది చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ ఇప్పటికే 270K వీక్షణలు సాధించింది.
A beautiful story between Virat Kohli & famous Kerala chef Pillai in 2018.