ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాతో రాబోతున్నారు. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈ సినిమాను.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.
ప్రస్తుతం అనంతపురంలో షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపుడితో 108వ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఆ తర్వాత ‘సర్కారు వారి పాట’ దర్శకుడు పరుశురాంతో ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే మరో ఇద్దరు, ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ బాలయ్యతో లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇవన్నీ పక్కకు పెడితే..
ఆదిత్య 369 సీక్వెల్ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతునే ఉంది. చాలా కాలంగా ‘ఆదిత్య 999’ పేరుతో ఈ సీక్వెల్ రానుందని వినిపిస్తునే ఉంది. అంతేకాదు.. బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కొన్ని సందర్భాల్లో సింగీతం శ్రీనివాసరావు స్క్రిప్టు రెడీగా ఉందని చెబుతూ వస్తున్నారు.
తాజాగా మరోసారి ఈ హిట్ సీక్వెల్ తెరపైకి వచ్చింది. అన్ స్టాపబుల్ 2 టాక్ షోలో ఆదిత్య 369 పై బాలయ్య క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ వస్తుందని.. ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలిపాడు. అలాగే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు.. బాలయ్య చెప్పాడు. దాంతో నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.