NLG: నల్గొండలోని 3వ వార్డు భవాని నగర్లోని కాలనీవాసులు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గ్రీవెన్స్డేలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. డ్రైనేజీ విద్యుత్ స్తంభాలు తాగు నీరు, సీసీ రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తమకు సౌకర్యాలు కల్పించాలని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్,రాజు,కొండల్ తదితరులున్నారు.