WGL: ప్రజలందరు సైబర్ నేరాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలని, నిరంతర నిఘా అవసరమని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సోమవారం సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 56 కేసులు నమోదవగా.. ఇందులో 50 ఫైనాన్స్ కేసులు, 6 నాన్ ఫైనాన్స్ కేసులు నమోదైనట్లు తెలిపారు. చాలా వరకు చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నట్లు చెప్పారు. ఎవరైనా మోసపోతే తక్షణమే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.