సంపూర్ణ చంద్ర గ్రహణం తర్వాత చంద్రుడు మళ్లీ సాధారణ స్థితికి వచ్చి, ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. గ్రహణం సమయంలో ఎరుపు రంగులోకి మారిన చంద్రుడిని ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం 82 నిమిషాల పాటు కొనసాగింది. తర్వాతి సంపూర్ణ చంద్ర గ్రహణం 2028, డిసెంబర్ 31న ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.