హుడెడ్ పిటోహుయ్ ప్రపంచంలో విషపూరితమైన ఏకైక పక్షి జాతి. ఇది న్యూగినియాలో కనిపిస్తుంది. ఈ పక్షుల రెక్కలు, చర్మం, ఈకలపై బట్రాకోటాక్సిన్ అనే హానికరమైన కెమికల్ ఉంటుంది. విషపూరితమైన పురుగులను తినడం వల్ల వాటి శరీరంలో విషం పేరుకుపోతుందట. ఇది వేటగాళ్ల నుంచి వాటిని రక్షించుకోవడానికి సహాయపడుతుంది. వీటిని పట్టుకోవడం, తాకడం వల్ల చర్మం మంటగా అనిపించడం, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయట.