BPT: భూ రికార్డుల్లో పారదర్శకత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ నేత అనగాని శివప్రసాద్ అన్నారు. బుధవారం రేపల్లె మండలం ఉప్పూడిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించి, వారికి పూర్తి భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.