అన్నమయ్య: రాయచోటి రూరల్ మండలం అబ్బవరం గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా టపాసులు పేలుస్తుండగా శివశంకర్, మనోజ్ అనే ఇద్దరికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న రాష్ట్ర TDP కార్యనిర్వాహక కార్యదర్శి ప్రసాద్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.