GNTR: తెనాలి-గుంటూరు మార్గంలోని చెంచుపేట రైల్వే ఓవర్ బ్రిడ్జిపై 6 టన్నులకు మించిన భారీ వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ పి. శ్రీకాంత్ తెలిపారు. బ్రిడ్జి మరమ్మతుల నిమిత్తం బాపట్ల అసిస్టెంట్ డివిజనల్ రైల్వే ఇంజనీర్ సూచనల మేరకు ఈనెల 8వ తేదీ సోమవారం నుంచి పనులు పూర్తయ్యే వరకు భారీ వాహనాలకు అనుమతి ఉండదని ఆయన పేర్కొన్నారు.