SRPT: సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆర్ అండ్ బీ ఈఈ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ తనిఖీ చేయగా ఆ సమయంలో ఏడుగురు అధికారులు కార్యాలయంలో లేకపోవడాన్ని గుర్తించారు. వారందరూ ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, విధులకు గైర్హాజరయ్యారని తెలుసుకొని ఏడుగురిని ఒకేసారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.