»Revanth Reddy Looted Lakhs Of Crores With Kcr Mafia Model Rule
Revanth Reddy: KCR మాఫీయా మోడల్ పాలనతో లక్షల కోట్లు దోచుకున్నాడు
TSPSC స్కాం సహా ఇతర భూ స్కాంల ద్వారా సీఎం కేసీఆర్(CM KCR) లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. అలా వచ్చిన డబ్బును ఇతర రాష్ట్రాల సీఎంలకు ఇచ్చి తాను ప్రధాని కావాలని కలలు కన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మాఫియా మోడల్ పాలన చేస్తున్న కేసీఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్(cm kcr) హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో వేల కోట్ల రూపాయల భూమిని దోచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. దీంతోపాటు అనేక చోట్ల భూ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. తనకు అనుకూలంగా ఉన్న వారికి ఆ భూములను కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. అలా అనేక మంది ప్రముఖ వ్యాపారస్థుల నుంచి వేల కోట్ల రూపాయలు దండుకున్నాడని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మరోవైపు కేసీఆర్ కంట్రాక్టుల పేరుతో అనేక నిర్మాణాలు వారి బినామీలకే ఇప్పించి అలా కూడా డబ్బులు దండుకున్నాడని పేర్కొన్నారు. బంగారం కంటే విలువైన భూమిని అనేక మంది వ్యాపారస్తులకు అడ్డదారిన కట్టబెట్టడం గురించి ప్రజలు గమనించాలని కోరారు. అలా కేసీఆర్ అనేక అక్రమాలు చేసినట్లు రేవంత్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్(KCR) లక్ష కోట్ల రూపాయల దోపిడీ చేసీ వాటిని ఎన్నికల సమయాల్లో విచ్చల విడిగా ఖర్చు చేసినట్లు ఆరోపించారు. మరోవైపు ఇటీవల మునుగోడు సహా అనేక ఉప ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అక్రమంగా సంపాదించిన డబ్బును తన స్వార్థం కోసం ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
తనకు మద్దతు ఇవ్వాలని మీకు కావాల్సిన వేల కోట్ల రూపాయలను సమకూర్చుతానని కేసీఆర్(kcr) పలు రాష్ట్రాల్లో బేరసారాలు జరిపినట్లు రేవంత్ స్పష్టం చేశారు. ఆ క్రమంలోనే గతంలో ఢిల్లీ సీఎంకు వందల కోట్లు రూపాయలు KCR ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాత తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కూడా శివ కుమార్ కు దోపిడీ సొమ్ము ఇచ్చినట్లు తెలిపారు.
అంతేకాదు గతంలో ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా సీఎం జగన్ కోసం వందల కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు చేశాడని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇలా తెలంగాణలో దోచుకున్న డబ్బును తన కోసం ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నాడని రెవండ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అనేక మాఫియాలు, స్కాములు చేసి ప్రజల సోమ్మును కేసీఆర్ దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు.