VZM: ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జన్మదిన సందర్భంగా వైసీపీ శ్రేణులు/అభిమానులు బొబ్బిలి పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి చింపివేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన పట్టణ సీఐ సతీష్‌తో ఫోన్లో మాట్లాడి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.