HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇవాళ గుండెపోటుతో చెంగల ఆశిర్లు (64) అనే వృద్ధుడు మృతి చెందాడు. శ్రీకాకుళంకు చెందిన ఆశిర్లు, పెన్షన్ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా, రైలు దిగి ప్లాట్‌ఫారమ్ మీద కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.