ADB: జిల్లాలోని 104 FDHS ఉద్యోగులు కంటినేషన్ ఆర్డర్లు ఇచ్చి పెండింగ్లో ఉన్న 5నెలల జీతాలు విడుదల చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఉద్యోగులకు 5నెలలుగా జీతాలు లేక, కంటినేషన్ ఆర్డర్ లేక పస్తులు ఉంటూ గడపాల్సిన పరిస్థితి వచ్చిందని వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.