కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో కుక్కల బెడదను నివారించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తహశీల్దార్ భుజంగరావుకు వారు వినతిపత్రం ఇచ్చారు. పట్టణంలో రోజురోజుకూ వీధికుక్కల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.