MBNR: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నేడు ZPTC, MPTC ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీలు 77 కాగా, ఎంపీటీసీలు 800 ఉన్నాయి. వీటిపై ఈనెల 8న సమావేశాలు నిర్వహిస్తారు. 9న అభ్యంతరాలను స్వీకరణ, పరిష్కారం అనంతరం 10వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రదర్శించనున్నారు.