కామారెడ్డి పట్టణ కేంద్రంలోని టెక్రియాల్ చెరువు వద్ద శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జన శోభయాత్ర సందర్భంగా 108 సిబ్బంది సేవలు అందిస్తున్నారు అని పైలెట్ కార్తీక్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, DMHO ఆదేశాల మేరకు వినాయక నిమజ్జన శోభయాత్ర సందర్భంగా చెరువు వద్ద అనుకొని ఏదైనా సంఘటన ఎదురైతే తక్షణ సహాయం కొరకు 108 వాహనం ఏర్పాటు చేశామన్నారు.