E.G: అధిక ఇసుక లోడుతో రవాణా చేసే వాహనాలపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రశాంతి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలోని లాలాచెరువు రహదారిలో అధిక లోడుతో నిలిపి ఉన్న రెండు లారీలను శుక్రవారం రాత్రి పోలీసులు గుర్తించారు. రెండు లారీలపై రూ.1,29,000 అపరాధ రుసుము విధించారు.