Greater Noida: గ్రేటర్ నోయిడా(Greater Noida)లో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల నుండి తప్పిపోయిన రెండేళ్ల పసిబిడ్డ మృతదేహం ఆదివారం పొరుగువారి ఇంట్లో పడి ఉన్న సూట్‌కేస్(Suitcase)లో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆ ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు. ఈ సంఘటన సూరజ్‌పూర్ ప్రాంతంలోని దేవ్లా గ్రామంలో జరిగింది. దేవ్లాలో అద్దెకు ఉంటున్న శివ కుమార్, అతని భార్య ఇద్దరు పిల్లలలో నివసిస్తున్నారు. శివకుమార్ స్థానిక కర్మాగారం(Factory)లో పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 7న శివకుమార్ డ్యూటీలో ఉన్నాడు. అతని భార్య పిల్లలిద్దరినీ ఇంట్లో వదిలి మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. చుట్టుపక్కల ఆరా తీసినా ఆమె జాడ కనిపించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ ఫిర్యాదుతో పోలీసులు వెతుకులాట ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది.
ఆదివారం మధ్యాహ్నం ఇంటి తాళం వేసి ఉన్న పక్కింటి(Neighbour’s House)నుంచి దుర్వాసన రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సూరజ్‌పూర్(surajpur)కు చెందిన పోలీసు(Police) బృందం ఆ ప్రాంతానికి చేరుకుని ఇంటిని వెతకగా అక్కడ సూట్‌కేస్‌లో తప్పిపోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆ ఇల్లు రాఘవేంద్ర అనే వ్యక్తికి చెందినదని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.