»Vizag Steel Plant Cbi Ex Jd Vv Lakshminarayana Said Thanks To K Chandrashekar Rao
CM KCRకు జేడీ లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు.. YS Jagan కూడా ఇలా చేయాలి
కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా ఏపీ సీఎం జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు. ఫ్యాక్టరీని విక్రయించొద్దు అనే ఒక్క మాట జగన్ కానీ, వైఎస్సార్ సీపీ కానీ అనలేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) నిర్వహణకు సంబంధించిన ఈఐఓ (Expression of Interest -EOI) ప్రతిపాదనల బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనాలనే నిర్ణయంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ( VV Lakshminarayana) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ను చూసి ఏపీ సీఎం జగన్ నేర్చుకోవాలని.. ఆయన కూడా అలా చేయాలని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై గతంలోనే జేడీ లక్ష్మీనారాయణ వ్యతిరేకించారు. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ను కాపాడేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చూపిస్తున్న చొరవకు కృతజ్ఞతలు తెలిపారు.
‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈవోఐ ప్రక్రియలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్ కు చాలా ధన్యవాదాలు. ఏపీ సీఎం జగన్, సెయిల్ కూడా ఈవీఐలో భాగస్వామ్యానికి ఇదే విధమైన ఆసక్తి చూపిస్తాయని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. మొదటి నుంచి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను లక్ష్మీ నారాయణ వ్యతిరేకిస్తున్నారు. విశాఖ కార్మికులు చేసిన ఆందోళనకు మద్దతు కూడా తెలిపారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
పోరాడి సాధించుకున్న విశాఖపట్టణంలోని (Visakhapatnam) ఉక్కు ఫ్యాక్టరీని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం అమ్మేసేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం విశాఖలోనే ఉంది. మంచి లాభాలు సంపాదించి పెడుతున్న ఈ కర్మాగారాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోంది. దీనిపై కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా ఏపీ సీఎం జగన్ (YS Jagan) మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు. ఫ్యాక్టరీని విక్రయించొద్దు అనే ఒక్క మాట జగన్ కానీ, వైఎస్సార్ సీపీ కానీ అనలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) మాత్రం ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao), మంత్రి కేటీఆర్ (KT Rama Rao), ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు విశాఖ ఉక్కు కర్మాగారంపై మాట్లాడారు. ఫ్యాక్టరీని అమ్మేయొద్దని బహిరంగంగా డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మద్దతు పలికింది. అన్నట్టుగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ యొక్క EOI ప్రక్రియలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నందుకు శ్రీ. కేసీఆర్ గారికి #KCR చాలా ధన్యవాదాలు. @KTRBRS@BRSHarish .AP, CM & SAIL కూడా EOIలో భాగస్వామ్యానికి ఇదే విధమైన ఆసక్తిని చూపుతాయని ఆశిస్తున్నాను.@ysjagan@SAILsteelpic.twitter.com/D6DWhgnYEL
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 10, 2023