మన కళ్లకు ఒక్క ఏనుగు కనిపిస్తే.. ఎంతో ఉత్సాహంగా ఫీలౌతాం. అలాంటిది.. ఒకటి కాదు… రెండు కాదు.. ఒక ఏనుగుల గుంపే.. కుటుంబం లాగా.. నదిలోకి దిగి స్నానం చేస్తే.. చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుంది. అదే జరిగింది. ఓ ఏనుగుల గుంపు నదిలోకి దిగి ఒకేసారి స్నానం చేస్తుండగా… ఓ ఫారెస్ట్ అధికారి కంట పడింది. అంతే.. ఆయన దానిని వీడియో తీసి నెట్టింట షేర్ చేశాడు. వాటిని నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు.
కుటుంబం మొత్తం కలిసి ఒకేసారి స్నానానికి నదిలోకి దిగాయి అంటూ.. ఆ ఫారెస్ట్ అధికారి వీడియోకి క్యాప్షన్ పెట్టడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వీడియోకి లైకుల వర్షం కురుస్తోంది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో లైకులు రావడం విశేషం. ఈ వీడియోని నవంబర్ 4 వ తేదీన పోస్టు చేశారు.
ఈ వీడియోకి నెటిజన్ల రియాక్షన్ ఇంకా బాగుంది. కుటుంబంతో కలిసి జీవించడం.. జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం