NLR: నెల్లూరు వైసీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్పై మరో చీటింగ్ కేసు నమోదైంది. ఓ ల్యాండ్ వ్యవహారంలో తన వద్ద నుంచి రూ.16 లక్షలు తీసుకున్నారని ప్రతిమ అనే మహిళ గురువారం చిన్న బజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఏటీఎం కార్డు ఉపయోగించి నగదు డ్రా చేశారనేది ఆరోపణ, ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.