»Sachin Pilot Revives War With Ashok Gehlot Announced One Day Fast
Sachin Pilot ఒకరోజు దీక్ష.. గెహ్లాట్ పక్కలో బల్లెంలా..? ఈసారి ఎందుకంటే.?
రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ మరోసారి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన నిరసన దీక్ష చేపడుతానని ప్రకటించారు. వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.
Sachin Pilot Revives War With Ashok Gehlot, announced one day fast
Sachin Pilot:గత కొద్దికాలంగా స్తబ్దుగా ఉన్న రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ (Sachin Pilot) మరోసారి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన (మంగళవారం) ఒక రోజు నిరసన దీక్ష చేపడుతానని ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే (vasundhara raje) ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ (ashok gehlot) చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. నిరసనగా ఒకరోజు దీక్ష చేస్తానని వెల్లడించారు.
రాజస్థాన్ సీఎం రేసులో.. 2018లో అశోక్ గెహ్లట్తోపాటు సచిన్ పైలట్ (Sachin Pilot) కూడా ఉన్న సంగతి తెలిసిందే. సోనియా గాంధీ (sonia gandhi) గెహ్లట్ వైపు మొగ్గుచూపడంతో.. పైలట్‌కు పదవీ వరించలేదు. ఆ తర్వాత ధిక్కార స్వరం వినిపించి.. హర్యానాలో ఎమ్మెల్యేలతో క్యాంప్ వేసినప్పటికీ.. వసుంధర రాజే (vasundhara raje) అడ్డగించారు. బీజేపీలో చేరేందుకు బ్రేక్ వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఇప్పుడు గెహ్లట్ ప్రభుత్వంపై మళ్లీ నిరసనకు దిగబోతున్నారు.
రాజస్థాన్ అసెంబ్లీకి ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నిక జరగనుంది. 8 నెలల్లో ఎన్నికలు ఉండగా.. పైలట్ (Sachin Pilot) మాత్రం గెహ్లట్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎక్సైజ్ మాఫియా, అక్రమంగా ఇసుక తరలింపు, భూ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. లలిత్ మోడీ అఫిడవిట్ కేసును కూడా ప్రస్తావించారు.
వసుంధర రాజే (raje) అండ్ కోపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సచిన్ పైలట్ (Sachin Pilot) అడుగుతున్నారు. మరో 6 నుంచి 7, 8 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కూడా చర్యలు తీసుకోకపోతే ఎలా? తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెబితే కాంగ్రెస్ కార్యకర్తల్లో అసహనం పెరుగుతుందని.. తాము చెప్పే మాటలు, చేతలకు సంబంధం ఉండదని చెప్పారు.
వసుంధర రాజేకి (raje) సంబంధించి గతంలో సీఎం అశోక్ గెహ్లట్ ప్రదర్శించిన వీడియోలను సచిన్ పైలట్ మీడియాకు చూపించారు. అవినీతి పాలనకు సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలు జారీచేయలేదని అడిగారు. అవినీతికి సంబంధించి తమ ప్రభుత్వం వద్ద ఆదారాలు ఉన్నాయని.. కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటున్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే.. మరోసారి ఎన్నికలకు వెళ్లడం కుదరదని తేల్చిచెప్పారు. ఆధారాలు ఉన్నప్పుడు విధిగా చర్యలు తీసుకోవాలని కోరారు. దర్యాప్తు చేయించాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికల కోడ్ రాబోతుందని.. కనీసం ఇప్పుడు అయినా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.
రాజస్థాన్ వ్యవహారాలకు సంబంధించి పార్టీలో ముఖ్య నేతకు తాను ఇప్పటికే సలహా, సూచన ఇచ్చానని సచిన పైలట్ చెప్పారు. వారిలో కొందరు స్పందించారని.. ఇదీ తమ ప్రభుత్వం అని.. చర్యలు తీసుకోవాలని తన అభిప్రాయంతో ఏకీభవించారని చెప్పారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచారని.. వారిని నమ్మకాన్ని వమ్ము చేయొద్దని అన్నారు.