Allu arha సూపర్బ్.. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు, సమంత ప్రశంసలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హపై ప్రముఖ నటి సమంత ప్రశంసలు కురిపించారు. చిన్నారి మంచి యాక్టర్ అవుతుందని.. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు అని.. పెద్ద డైలాగ్ కూడా అవలీలలగా చెబుతోందని తెలిపారు.
Samantha on Allu arha:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) కూతురు అల్లు అర్హపై (allu arha) నటి సమంత (samantha) ప్రశంసలు కురిపించారు. చిన్నారి మంచి యాక్టర్ అవుతుందని.. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదు అని.. పెద్ద డైలాగ్ కూడా అవలీలలగా చెబుతోందని తెలిపారు. సమంత (samantha) శాకుంతలం మూవీ ద్వారా అల్లు అర్హ (allu arha) బాల నటిగా తెరంగ్రేటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 14వ తేదీన మూవీ రిలీజ్ చేయనున్నారు. ఆ సినిమా ప్రమోషన్లో హీరోయిన్ సమంత (samantha) పాల్గొన్నారు.
అల్లు అర్హ (arha) కెరీర్ అద్భుతంగా ఉండబోతుందని సమంత (samantha) అంటున్నారు. శాకుంతలం మూవీలో మిగతా పాత్రల కన్నా.. అర్హ (arha) పాత్ర చక్కగా ఉంటుందని వివరించారు. చిన్నప్పుడే అర్హ (arha) చక్కగా డైలాగులు చెబుతోందని.. పెద్దగా ఉన్నా సరే.. తేలికగా చెప్పేస్తుందని తెలిపారు. అర్హ (arha) పాత్రతో చిన్న పిల్లలు చక్కగా కనెక్ట్ అవుతారని సమంత పేర్కొన్నారు. అర్హ (arha) ఆలోచన శక్తి అద్బుతం అని సమంత ప్రశంసించారు. అర్హ (arha) కెరీర్ గురించి ఆమె తండ్రి అల్లు అర్జున్ (allu arjun) జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆమె కెరీర్ గురించి ఆమె చూసుకోగలదని చెప్పారు.
శాకుంతలం (shaakuntalam) పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ సినిమాను హృద్యంగా తీర్చిదిద్దారు. తెలుగుతోపాటు తమిళ (tamil), కన్నడ (kannada), హిందీ (hindi), మలయాళ (malayalam) భాషల్లో ఒకేసారి మూవీ విడువలనుంది. 3డీ వెర్షన్లో కూడా సినిమా రిలీజ్ చేస్తారని చిత్ర యూనిట్ పేర్కొంది. శాకుంతలం (shaakuntalam) సినిమా సమంతను (samantha) మరో రేంజ్‌కు తీసుకెళ్తుందని ఫిల్మ్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.