»If We Come To Power We Will Do Caste Census In Rajasthan Congress Manifesto 7 Key Promises
Rajasthan Congress: అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం..కాంగ్రెస్ కీలక హామీలు
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తన మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ పార్టీ ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రంధావా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ సీపీ జోషి, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ 'జన్ ఘోషణ పాత్ర' మేనిఫెస్టోను విడుదల చేశారు.
If we come to power we will do caste census in rajasthan Congress manifesto 7 key promises
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(ashok gehlot)r మంగళవారం కాంగ్రెస్ మేనిఫెస్టో(manifesto)ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కుల గణన సర్వే చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఎన్నికల మేనిఫెస్టోలో పంచాయతీ స్థాయిలో నియామకాలు, సంక్షేమం కోసం కొత్త స్కీం తీసుకొస్తున్నట్లు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మేనిఫెస్టో ఏ ప్రాతిపదికన రూపొందించబడిందనే దానిపై మేము ప్రజల నుంచి సూచనలు పొందామని గుర్తు చేశారు. అంతేకాదు తాము 2018లో ఇచ్చిన వాగ్దానాలలో 96% నెరవేర్చామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.
ఆర్థిక అభివృద్ధి రేటులో ఉత్తర భారతదేశంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉందన్నారు. రాజస్థాన్(Rajasthan) ఆర్థిక వృద్ధి ఈ సంవత్సరాంతానికి రూ.15 లక్షలకు చేరుకుంటుంది. ఇది 2030 నాటికి రూ.30 లక్షల కోట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. జైపూర్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో- ‘జన్ ఘోషణ పాత్ర’ పేరుతో విడుదల చేసిన కాంగ్రెస్ మేనిఫోస్టో కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సహా పలువురు హాజరయ్యారు. రాజస్థాన్లో నవంబర్ 25న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్(congress) మళ్లీ అధికారంలోకి వస్తే రాజస్థాన్ ప్రజలకు ‘ఏడు హామీలు’ వెంటనే అమలు చేస్తామని అక్కడి సీఎం అన్నారు.
– కుటుంబ పెద్దకు వార్షిక గౌరవ వేతనం రూ.10,000
– 1.04 కోట్ల కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు
– పశువుల పెంపకందారుల నుంచి కిలో రూ.2 చొప్పున పేడ కొనుగోలు
– చిరంజీవి ఆరోగ్య బీమా పథకం ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంపు
– ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ అమలు
– ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు/టాబ్లెట్లు
– ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల వరకు బీమా కవరేజీ